కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లీ.. పగ్గాలు ఎవరికీ..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే మరియు టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త టీమిండియా క్రికెట్ లో దూమారం రేపుతోంది. 

 

ఇక ఈ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ స్వయంగా బీసీసీఐ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లీ బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొని టెస్ట్ కెప్టెన్సీపై ఫోకస్ చేయాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం. కోహ్లీ కూడా గత కొంతకాలంగా వ్యక్తిగతంగా రాణించడం లేదు. దీంతో తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టేందుకు, ఎక్కవ కాలం ఆడేందుకు తానే సారథ్య బాధ్యతలు వదిలేస్తాడని విశ్లేషకులు అంటున్నారు. 

ఇక పరిమిత ఓబర్ల క్రికెట్ లో రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించాలని చాలా కాలంగా డిమాండ్ కూడా ఉంది. ఐపీఎల్ లోనూ కెప్టెన్ గా రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. దీంతో రోహిత్ కే వన్డే, టీ20 ఫార్మాట్ల పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ కు బాధ్యతలు అప్పగించేందుకు కోహ్లీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

  

Leave a Comment