రెండు డోసులు టీకా తీసుకున్న వారిలో పెరగని యాంటీబాడీలు..!

భువనేశ్వర్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ షాకింగ్ విషయం వెల్లడించింది. ఒడిషాలో రెండు డోసులు తీసుకున్న 20 శాతం మందిలో యాంటీబాడీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదని స్పష్ం చేసింది. యాంటీబాడీ జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడైందని చెప్పింది. వారికి బూస్టర్ డోసులు అవసరమవుతాయని వెల్లడించింది. 

ఒడిశాలో ఇప్పటి వరకు 61.32 లక్షల మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారు. అందులో ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి చెందిన 10 లక్షల మంది ఉన్నారు. ఈ పది లక్షల మందిలో దాదాపు 20 శాతం మందికి పూర్తిస్థాయిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందలేదని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ స్పష్టం చేసింది. రెండు టీకాలు తీసుకున్న వారిలో 60 వేల నుంచి లక్ష లోపు యాంటీబాడీలు ఉండాలని, కానీ 20 శాతం మందిలో 50 వేల కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొంది. వీరికి బూస్టర్ డోస్ అవసరమవుతుందని అభిప్రాయపడింది. 

కోవిడ్ టీకీ రెండు డోసులు తీసుకున్నప్పటికీ వారిలో యాంటీబాడీలు పెరగకపోవడానికి జన్యుపరమైన వ్యత్యాసాలే కారమణని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ పరీద అనుమానం వ్యక్తం చేశారు. టీకా తీసుకోని వారు, 18 ఏళ్ల పిల్లలతో పాటు ఈ 20 శాతం మంది కూడా థర్డ్ వేవ్ సమయంలో కరోనా బారినపడే అవకాశం ఉందని వెల్లడించారు. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యాంటీబాడీలు లేని వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్ర యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

  

Leave a Comment