రాత్రి వేళ ఆకలి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..!

ప్రస్తుతం ప్రతి ఒక్కరీ జీవితం బిజీగా ఉంటుంది. దీంతో తిండిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఒకవేళ తిన్నా కూడా ఏదో అరకొరగా తినేసి పరుగులు తీస్తున్నారు. ఇక కొంతమంది రాత్రి తినకుండానే నిద్రపోతున్నారు. దీంతో అర్ధరాత్రి సమయంలో ఆకలి సమస్యతో బాధపడుతున్నారు. మరికొంత మంది బరువు పెరుగుతున్నామని డైటింగ్ పేరుతో ఆహారం సరిగ్గా తినడం లేదు. ఆకలి వేసినప్పటికీ కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తక్కువగా ఆహారం తీసుకుంటున్నారు. దీంతో వారికి నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి. 

రాత్రి ఆకలి కాకుండా చిట్కాలు:

  • డైటింగ్ పాటించే వారు త్వరగా జీర్ణమయ్యే తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
  •  సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కడుపు నిండటంతో పాటు హాయిగా నిద్ర పడుతుంది.
  •  నూనెలో వేయించని మరమరాలను తినడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు.. 
  • అంతే కాకుండా జొన్నలు, రాగులు, కొర్రలతో చేసిన చిప్స్ తింటే అటు పోషకాలు అందడంతో పాటు త్వరగా జీర్ణమై నిద్ర బాగా పడుతుంది. 

మితంగా ఆహారం వద్దు:

పగటి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ రాత్రి సమయంలో మితంగా ఆహారం తీసుకుంటారు చాలా మంది.. ఎంత ఆకలి వేసినప్పటికీ తక్కవగానే తీసుకుంటారు. ఇలా తీసుకోవడంతో కొన్ని సార్లు రాత్రి తీసుకునే ఆహారం సరిపోక అర్ధరాత్రి సమయంలో ఆకలి వేస్తుంటుంది. దీంతో ఆకలితో రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు. అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తే ఈ సమస్యను తీర్చుకోవచ్చు.  

చక్కెర పదార్థాలు వద్దు:

రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించాలి. ఉప్పు, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఫలితంగా మీ నిద్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. రాత్రిళ్లు మీ కండరాలు, ఇతర టిష్యూలు రిపేర్ చేసుకునే మోడ్ లోకి జారుకుంటాయి. అలాగే శరీరం కూడా పలు క్రియలను నిద్రలో జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంది. నిద్ర సరిగ్గా పట్టేందుకు ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి6, ట్రైటోఫాన్, అలాగే కొన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి.  

 

Leave a Comment