ఇలా చేస్తే మీ కిడ్నీలు భద్రంగా ఉంటాయి..!

కిడ్నీలు మానవుని శరీరంలో ఓ ముఖ్యమైన అవయవం.. కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మన జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మనం రోగాల బారిన పడుతున్నాం.. అలాంటి సమస్యల్లో కిడ్నీ సమస్య కూడా ఒకటి.. అయితే కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచవచ్చు. అవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ నాలుగు మూలికలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి..

డాండెలైన్ టీ:

డాండాలైన్ టీలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మూత్రవిసర్జన స్థాయి పెరుగుతుంది.  మరియు మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది.

కొత్తిమీర:

మూత్ర మార్గం, పీహెచ్ స్థాయిని తగ్గించడానికి, సమతుల్యం చేయడానికి కొత్తిమీర గొప్ప మూలికగా చెప్పొచ్చు. ఇందులో అనేక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే ఈమూలికను ఆయుర్వేదిక్ నిపుణులతో సంప్రదించిన తర్వాత పరిమిత పరిమాణంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉండదు. 

రెడ్ క్లోవర్:

ఈ మూలిక మూత్రపిండాలను శుభ్రపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. రెడ్ క్లోవర్ లో ఉండే ఐసోఫ్లేవోన్స్ మూత్రపిండాల వ్యాధులకు చాలా మేలు చేస్తాయి. మూత్ర పిండాల్లో రాళ్లను తొలగించడానికి ఉపయోగపడతాయి. 

గోల్డెన్ రోడ్:

ఈ మూలిక మానవుని ఆరోగ్యంపై అద్భుత ప్రభావాన్ని చూపుతుంది. మూతర పిండ రుగ్మత, మూత్రపిండాల వ్యాధి, ఇతర మూత్ర పిండ సంబంధిత వ్యాధితో బాధపడేవారికి గోల్డెన్ రోడ్ ఒక వరంగా చెప్పొచ్చు. ఇది మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి, మూత్ర పిండాల నుంచి విష పదర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. 

కిడ్నీ సమస్యకు మరికొన్ని చిట్కాలు:

  • రోజుకు 7-8 గ్లాసుల నీటిని తాగాలి.
  • నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కీడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • క్యాప్సికంలో ఉండే విటమిన్ ఎ, సీ, పొటాషియం తదితర పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. 
  • ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు, పైనాపిల్స్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • బెర్రీలలో ఫైబర్, విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోయేలా చేస్తాయి. 
  • ముఖ్యంగా మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. 

 

Leave a Comment