పాక్ ప్లేయర్ రిజ్వాన్ కోలుకోవడంలో.. ఇండియన్ డాక్టర్ పాత్ర..!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.. థ్రిల్లింగ్ విక్టరీతో ఆస్ట్రేలియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. 52 బంతుల్లో 67 పరుగులు సాధించాడు..

కాగా ఈ మ్యాచ్ కి ముందు మహ్మద్ రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. రిజ్వాన్ సెమీస్ ముందు వరకు ఐసీయూలో ఉన్నాడు. నవంబర్ 9న రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు. తర్వా రిజ్వాన్ ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్ ఆడాడు. అతను ఫిట్ గా లేకున్నా కూడా 87 నిమిషాలపాటు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో రిజ్వాన్ 52 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేశాడు.. దీంతో రిజ్వాన్ ను అందరూ ప్రశంసించారు.  

అయితే అనారోగ్యంతో ఉన్నా రిజ్వాన్ త్వరగా కోలుకోవడంలో ఓ ఇండియన్ డాక్టర్ కీలక పాత్ర వహించాడు. దుబాయ్ లోని మెడెరో ఆస్పత్రిలో పల్మోనాలజిస్ట్ గా భారత్ కు చెందిన షహీర్ సైనాలాబ్దీన్ పనిచేస్తున్నాడు. అతడు రిజ్వాన్ కు రెండు రోజుల పాటు చికిత్స చేశాడు. చెస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు 5-7 రోజులకు కోలుకుంటారని, కానీ రిజ్వాన్ ఇంత త్వరగా కోలుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని డాక్టర్ సైనాలాబ్దీన్ అన్నారు. తాను జట్టుతో ఆడాలనుకుంటున్నానని, తాను జట్టులో ఎలాగైనా ఉండాలని రిజ్వాన్ వైద్యులతో అన్నారని చెప్పారు. రిజ్వాన్ శారీరక దృఢత్వం, పట్టుదల అతడు కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయని వైద్యుడు తెలిపాడు. కాగా అతడు కోలుకోవడానికి కారణమైన డాక్టర్ సైనాలాబ్దీన్ ను తాను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని రిజ్వాన్ అందజేశాడు.   

 

Leave a Comment