ఆమె కష్టం ఫలించలేదు.. ఆప్పత్రిలో మరణించిన యువకుడు..!

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. దీంతో అక్కడ జనజీవనం స్తంభించింది. ఈక్రమంలో లేడీ పోలీస్ ఇన్ స్పెక్టర్ రాజేశ్వరీ చేసిన పని అందరితో ప్రశంసలు అందుకుంటోంది.. అనారోగ్యంతో శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్న 25 ఏళ్ల యువకుడిని తన భుజాలపై వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లిన తీరు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫస్ట్ కారులో ఎక్కించేందుకు ప్రయత్నించింది. కానీ ఎక్కించడం సాధ్యం కాలేదు. దీంతో అక్కడ నుంచి ఎదురుగా వస్తున్న ఆటో దగగ్గరకు తీసుకెళ్లి ఆటో ఎక్కించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆమె చేసిన పనికి అందరు శభాష్ మేడం, సెల్యూట్ మేడమ్ అంటూ ప్రశంసించారు..

దురదృష్టం ఏంటంటే.. ఆ యువకుడు బతకలేదు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు.. అయితే విధి నిర్వహణలో ఎస్ఐ రాజేశ్వరి ప్రదర్శించిన తెగువకు ఉన్నతాధికారులు అభినందించారు. తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సైతం ఆమె సేవను అభినందిస్తూ శుక్రవారం ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అయితే ఇంక కష్టపడి కాపాడిన ఆ వ్యక్తి చనిపోవడంతో ఎస్సై రాజేశ్వరి ఆవేదనకు గురయ్యారు..  

 

Leave a Comment