తల్లీ కొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

ఏదైనా సాధించాలి అనుకంటే వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ తల్లి.. తన కొడుకుతో పాటు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైంది. తల్లీ కొడుకులు ఇద్దరు ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేశారు. 42 ఏళ్ల బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్(ఎల్ఎస్జి)కి ఎంపిక కాగా, 24 ఏళ్ల కొడుకు లోయర్ డివిజన్ క్లర్క్ గా ఎంపికయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది ఇద్దరిని అభినందిస్తున్నారు.. అయితే 42 ఏళ్ల వయస్సులో ఉద్యోగం ఎలా వచ్చిందని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే కేరళలో ఈ పోస్టులకు 40 ఏళ్లు వయోపరిమితి ఉండగా.. ప్రత్యేక వర్గాలకు వయో సడలింపు ఉంది.

ఇద్దరు కలిసి కోచింగ్ :

మలప్పురానికి చెందిన బిందు, ఆమె కుమారుడు వివేక్ కలిసి పరీక్షల కోసం కోచింగ్ కి వెళ్లారు. ఇద్దరు పరీక్షలకు సన్నద్ధం కావడం కోసం తన నాన్న అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని వివేక్ తెలిపారు. ఇద్దరం కలిసి చదువుకున్నామని,  కానీ కలిసి పరీక్షలో ఉత్తీర్ణులవుతామని ఎప్పుడూ అనుకోలేదన్నారు.

కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాల్లో బిందు 92వ ర్యాంక్ సాధించగా, ఆమె కుమారుడు వివేక్ 38వ ర్యాంక్ సాధించాడు. ఇంతకు ముందు బిందు ఎల్‌జిఎస్ పరీక్షకు రెండు, ఎల్‌డిసికి ఒకటి చొప్పున మూడుసార్లు ప్రయత్నించింది. చివరకు నాలుగోసారి ఆమె విజయం సాధించడం గమనార్హం.

.

Leave a Comment