భారీ కొండచిలువను భుజాలపై మోసుకెళ్తిన వ్యక్తి.. వీడియో చూస్తే హార్ట్ బీట్ పెరగడం ఖాయం..!

ఈ వీడియో చూస్తే మీ హార్ట్ బీట్ పెరగడం ఖాయం.. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన భుజంపై ఒక పెద్ద కొండచిలువను మోసుకెళ్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లకు కళ్లు బైర్లు కమ్మాయి. కొంతమందికి గూస్‌బంప్‌లు వచ్చాయి! ప్రస్తుతానికి, వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడింది అనేది తెలియలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన భుజంపై పిండి బస్తా లాగా ఒక పెద్ద కొండచిలువను మోస్తున్నట్లు మనం చూడవచ్చు. కొండచిలువ చాలా పొడవుగా ఉంది. దాని శరీరంలో సగం భూమిపై వేలాడుతోంది. తన శక్తిని కూడదీసి ఆ కొండచిలువతో నెమ్మదిగా మెట్లు ఎక్కుతాడు. అతని శ్రమను చూస్తుంటే కొండచిలువ ఎంత బరువు ఉందో అర్థమవుతోంది.

ఈ వీడియో వరల్డ్ ఆఫ్ స్నేక్స్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోకు 6.5 లక్షల వ్యూస్, 37 వేల లైక్ లు వచ్చాయి. వందలాది మంది కామెంట్లు చేశారు. ఈ కొండచిలువ సజీవంగానే ఉందా అని కొంతమంది అడిగారు. కొందరైతే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Leave a Comment