చీమలు పట్టిన జీడిపప్పు తిన్నారు.. వీడియోకు ఏకంగా 10 మిలియన్ల వ్యూస్..!

జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.. చాలా మంది జీడిపప్పును ఇష్టంగా తింటారు.. అయితే జీడిపప్పుకు త్వరగా చీమలు పట్టేస్తుంటాయి.. అందకే తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.. అంతేకాదు తినేటప్పుడు ఓసారి పరిశీలించి తినాలి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.. ఆ వీడియోలో యువకులు చీమలుపట్టిన జీడిపప్పును తిన్నారు. ఆ తర్వాత వీరు వాంతులు చేసుకున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో 10 మిలియన్ల వ్యూస్ తో వైరల్ అవుతోంది.. 

ఆ వీడియోలో కొంత మంది యువకులు ఓ జీడిపప్పు ప్యాకెట్ తెచ్చుకున్నారు. ఆ ప్యాకెట్ ని ఓపెన్ చేసి అందులో పరిశీలించకుండానే పోటాపోటీగా తినేశారు.. అయితే ప్యాకేట్ అయిపోయేంత వరకు అందులో చీమలు ఉన్నాయని వారు గుర్తించలేదు. జీడిపప్పుతో పాటు చీమలను కూడా తినేశారు.. ఆ తర్వాత చీమలు ఉన్నాయని తెలుసుకుని ఓ యువకుడు వాంతి కూడా చేసుకున్నాడు.. ఈ వీడియోను రెడ్ కప్ న్యూస్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ నుంచి పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. 10 మిలియన్ల వ్యూస్, వేల లైక్ లతో ఈ వీడియో వైరల్ అవుతోంది.. నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.   

 

View this post on Instagram

 

A post shared by RedCup News (@redcupnews)

Leave a Comment