బిగ్ బాస్-4 టాప్-5లో ఉండేది వీళ్లే : కౌశల్

బిగ్ బాస్-2 విజేత కౌశల్ మండా సీజన్ 4 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్-4 కంటే రెండో సీజన్ బాగుందని చెప్పారు. ఇక ఈ సీజన్ లో అన్ని పాత టాస్కులే పెడుతున్నారని, కొత్త టాస్కులు పెట్టాలని బిగ్ బాస్ ను కోరారు. ఇక గతంలోని కొన్ని లవ్ ట్రాక్ లను ఈ సీజన్ కు కూడా అప్లయి చేయాలని చేశారన్నారు. కానీ అవి విఫలం అయ్యాయని తెలిపారు. అఖిల్, మోనాల్, అభిజిత్ ట్రయాంగిల్ స్టోరీ దానికి నిదర్శనమన్నారు. 

కాగా ఈ సీజన్ టాప్-5లో ఎవరుంటారనే దానిపై జోస్యం చెప్పారు. ప్రస్తుతానికి అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్ తో పాటు అఖిల్ లేదా సోహైల్ టాప్-5లో ఉంటారని తెలిపారు. అయితే తర్వాత పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే ఈ సీజన్ కు కూడా మహిళ విజేత ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.  

Leave a Comment