నయా దందా : అమ్మకానికి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్..

మీకు కరోనా పాటిజివ్ వచ్చిందా? అయితే భయం అవసరం లేదు.. మీకు నెగిటివ్ సర్టిఫికెట్ ఇస్తాం.. మీకు ఎలాంటి చింతా అవసరం లేదు. అంటూ కర్నాటకలోని బెంగళూరులో నయా దందా మొదలైంది.  కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ల జారీ పేరుతో అక్రమ దందాకు తెరలేపారు. క్వారంటైన్ కు భయపడి కొందరు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు మరి కొందరు ఇలా ఎవరికి వాళ్లు అవసరమైన రీతిలో సర్టిఫికెట్లు దక్కించుకుంటున్నారు.  

బెంగళూరు నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా టెస్టుల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కరోనా టెస్టులు తప్పనిసరి. ఈ నిబంధననే కొన్ని ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.2500 ఫిక్స్ చేసి సర్టిఫికెట్లు అమ్ముతున్నాయి. బెంగళూరు సిటీలో ఇప్పటికే భారీగా  తప్పుడు అడ్రస్, ఫేక్ ఫోన్ నెంబర్లతో కూడా సర్టిఫికెట్లు జారీ చేశారని సమాచారం.   

Leave a Comment