అండర్ వేర్ బదులు అరటి పండ్లు కట్టుకుని నిరసన..!

లాక్ డౌన్ విధిస్తూ అమలు చేస్తున్న నిబంధనలకు వ్యతిరేకంగా బ్రిటన లోని వేల్స్ లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ కరోనా కేసులు మళ్లీ పెరగడంతో ప్రభుత్వం 17 రోజులపాటు ఫైర్ బ్రేక్ లాక్ డౌన్ అనేది విధించింది. కేవలం నిత్యావసర వస్తువుల షాపులనే తెరిచేందుకు మాత్రమే అనుమతించింది. అక్కడి సూపర్ మార్కెట్ లో బట్టలు, షూస్, బొమ్మలు వంటి అమ్మకూడదని ఆదేశించింది. 

అయితే బట్టలు, షూస్ వంటివి నిత్యావసరాలు కావా? వాటిని ఎందుకు బ్యాన్ చేశారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దుస్తులు కూడా నిత్యావసరాలే అని, ఆ షాపులను అనుమతించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. కాగా స్టీఫెన్ మథ్యూస్ అనే వ్యక్తి వింతగా నిరసన వ్యక్తం చేశాడు. అండర్ వేర్ నిత్యావసరం కానప్పుడు ధరించనవసరం లేదంటూ కొత్త రకంగా నిరసన తెలిపాడు. పైన షర్ట్ మాత్రమే వేసుకొని అండర్ వేర్  బదులు అరటి పండ్లను కట్టుకున్నాడు.

 

Leave a Comment