శ్రీరాముడిపై కత్తి మహేష్ అసభ్య కామెంట్స్..అరెస్ట్ చేసిన పోలీసులు..!

ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే కత్తి మహేష్..తాజాగా సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు హిందూ సంఘాలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశాయంటూ  ఆయా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదు మేరకు కత్తి మహేష్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఐపీసీ సెక్షన్ 153(ఎ) కమ్యూనల్ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కత్తి మహేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కత్తి మహేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే తాను తప్పుగా ఏమి మాట్లాడలేదని, తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని కత్తి మహేష్ చెబుతున్నాడు. 

Leave a Comment