ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్ పరీక్షల తేదీలు ఖరారు..!

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లా సెట్, ఎడ్ సెట్ అన్ని పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10 నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్ ఎంసెట్ ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో ఏపీపీజీఈసెట్, అక్టోబర్ 1న ఉదయం ఎడ్ సెట్, మధ్యాహ్నం లాసెట్, అక్టోబర్ 2 నుంచి  5 వరకు ఏపీపీఈ సెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

 

Leave a Comment