డ్రీమ్ 11లో రూ.2 కోట్లు గెలిచిన యువకుడు..!

డ్రిమ్ 11 లో ఓ యువకుడు జాక్ పాట్ కొట్టాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. తాను ఎంపిక చేసుకున్న టీమ్ మొదటి స్థానంలో నిలవడంతో ఏకంగా రూ.2 కోట్లు గెలుచుకున్నాడు.. జమ్మూకశ్మీర్ రాష్ట్రం బిజ్ బెహరా పట్టణానికి చెందిన వసీం రాజా డ్రీమ్ 11లో బెట్టింగ్ పెడుతుంటాడు. క్రికెట్, హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో బెట్టింగ్ ఈ యాప్ లో బెట్టింగ్ పెడుతాడు.. 

శనివారం కూడా డ్రీమ్ 11లో జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఈసారి వసీం రాజాకు అదృష్టం కలిసి వచ్చింది. తాను ఎంపిక చేసుకున్న జట్టు మొదటి స్థానంలో నిలిచింది. దీంతో వసీం రాజా రూ.2 కోట్లు గెలుచుకున్నాడు. శనివారం రాత్రి నిద్రలో ఉండగా తన స్నేహితుడు ఫోన్ చేసి, తాను ఎంపిక చేసుకున్న జట్లు మొదటి స్థానంలో ఉందని చెప్పాడని వసీం తెలిపాడు. ఈ డబ్బులతో తమ పేదరికం పోతుందన్నాడు. తన అమ్మ అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెకు మెరుగైన చికిత్స చేయిస్తానని చెప్పాడు.  

Leave a Comment