కుక్కలా మారిపోయిన మనిషి.. కుక్క జీవతమే ఇష్టమట..!

చాలా మందికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం.. అందుకే ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా పెట్స్ ను పెంచుతుంటారు. అయితే పెంపుడు జంతువులను బాగా పెంచుతారే కానీ.. వాటిలా మారిపోవాలని ఎవరూ అనుకోరు కదా.. కానా, జపాన్ కి చెందిన టోకోకు మాత్రం మనిషిలా జీవించడం ఇష్టం లేదట. అందుకే పూర్తి కుక్కలా మారిపోయాడు.. 

అయితే, కుక్కలా మారేందుకు టోకో ఎలాంటి సర్జరీలు చేసుకోలేదు. కేవలం డాగ్ కాస్ట్యూమ్ ధరించాడంటే.. ఈ కాస్ట్యూమ్ ని స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నాడు.. టోకో చాలా కుక్క దుస్తులు ధరించి చూశాడు. కానీ వాటిలో అతడు పగటి వేశగాడిలా కనిపించేవాడు. ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్ వర్క్ షాప్ ‘జెప్పెట్’ సంస్థను సంప్రదించాడు.. 

తాను కుక్కలా జీవిస్తానని, అందుకు అవసరమైన అల్ట్రా-రియలిస్టిక్ డాగ్ కాస్ట్యూమ్ తయారు చేసి ఇవ్వాలని ఆ సంస్థను కోరాడు. అతడు కోరినట్లే సంస్థ కూడా కుక్క కాస్ట్యూమ్ ని తయారు చేసి ఇచ్చింది. అందుకు అతను రూ.11.64 లక్షలు చెల్లించాడట.. ఈ దస్తులు ధరించి టోకో నిజంగా కుక్కలాగే కనిపిస్తున్నాడు. 

ఈ కాస్ట్యూమ్ తయారీకి సుమారు 40 రోజులు పట్టిందట.. ఈ దుస్తుల్లో టోకో నోరు తెరిచినా.. కుక్క నోరు తెరిచినట్లే ఉంటుంది. అంతేకాదు.. తన కుక్క జీవితం గురించి నెటిజన్లకు చెప్పడానికి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు.. టోకో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు తాను కుక్కల ఎందుకు జీవించాలనుకున్నాడో టోకో చెప్పలేదు.. 

Leave a Comment