ఏపీలో అదానీ రూ.60 వేల కోట్ల పెట్టుబడి..!

ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం పలు సంస్థలతో ఆయన చర్చలు జరిపారు. ఆదివారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమైన సీఎం జగన్.. సోమవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది.. 

ఎనర్జీ ప్రాజెక్టులపై అదానీ గ్రూప్ తో ఏపీ ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది. 60 వేల కోట్ల రూపాయలతో రెండు కాలుష్య రహిత విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పాలని అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ నిర్ణయించింది. ఇందులో ఒకటి 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా, మరొకటి 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్.. 

ఈ రెండు ప్రాజెక్టుల కోసం రాష్ట్రంలో సుమారు రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో రాష్ట్రంలో మరో 10 వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒప్పందంలో భాగంగా సీఎం జగన్, గౌతమ్ అదానీ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఆశిష్, రాజవంశీ ఒప్పందంపై సంతకాలు చేశారు. 

Leave a Comment