పెళ్లికి నిరాకరించిందని.. యువతి తల నరికాడు..!

తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిని దారుణ హత్య చేశాడు.. ఆమె తల నరికి సంచిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.. ఈ దారుణ ఘటన కర్నాటకలోని విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కన్నిబొరయ్య హట్టిలో చోటుచేసుకుంది.. 

వివరాల మేరకు.. కన్నిబొరయ్యహట్టి గ్రామానికి చెందిన భోజరాజ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.. తన సమీప బంధువైన నిర్మల(21) అనే అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నానని భోజరాజ వెంటపడేవాడు.. ఓసారి వారి ఇంటికి వెళ్లి నిర్మలను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. అందుకు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

రెండు నెలల క్రితం భోజరాజకు మరో యువతితో పెళ్లి జరిగింది. నిర్మల పొరుగు జిల్లాలో నర్సింగ్ చదువుతోంది.. ఇటీవల ఆమె తన స్వగ్రామానికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో భోజరాజ, నిర్మల ఇంటికి వెళ్లాడు. ఈక్రమంలో నిర్మలతో భోజరాజ గొడవపడ్డాడు.. తనతో తీసుకెళ్లిన కత్తితో ఆమె తల నరికి హత్య చేశాడు. తలను బైక్ కి ఉన్న సంచిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

 

Leave a Comment