పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తిని రాసిచ్చాడు..!

ఉత్తరప్రదేశ్ కు చెందిన పారిశ్రామికవేత్త డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన మొత్తం ఆస్తిని పేదల కోసం ఇచ్చేశారు.. కేవలం ఇంటిని మాత్రమే ఉంచేసుకుని సుమారు రూ.600 కోట్ల విలువ చేసే ఆస్తిని యూపీ ప్రభుత్వానికి రాసిచ్చారు. పేద ప్రజలకు మంచి విద్య, వైద్యం అందాలనే గొప్ప ఉద్దేశంతోనే ఆయన ఈ పనిచేశారు..

మొరదాబాద్ కి చెందిన అరవింద్ గోయల్ 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. ఆయన 100కి పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు. కరోనా సమయంలో మొరదాబాద్ పరిధిలోని 50 గ్రామాలను దత్తత తీసుకుని అన్ని రకాల వసతులు కల్పించారు. ఉచిత వైద్యను అందించడంతో పాటు రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. గోయల్ కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబ సభ్యులు కూడా మద్దతిచ్చారు. గోయల్ తన సేవలకుగాను నలుగురు రాష్ట్రపతుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు..

కాగా 25 ఏళ్ల కిందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోయల్ తెలిపారు. ఆసమయంలో జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని మార్చివేసిందని చెప్పారు. 25 సంవత్సరాల క్రితం తాను రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తనుకు ఎదురుగా ఓ వ్యక్తి కూర్చున్నాడని, వణుకుపుట్టించే చలిలోనూ అతని వద్ద ఒంటిపై కప్పుకోవడానికి ఏమీ లేవని తెలిపారు. అతని కాళ్లకు చెప్పులు కూడా లేవన్నారు. అతడిని చూసి చలించిపోయి చేతనైన సాయం చేశానని, కానీ ఆ సంఘటన తన మనసులో అలాగే ఉండిపోయిందని అన్నారు. అప్పుడే ఇలాంటి వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. 

 

Leave a Comment