కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. జిమ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్..!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) ఇకలేరు. పునీత్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈరోజు ఉదయం జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా పునీత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే పునీత్ ను బెంగళూరు విక్రం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. గుండెపోటు కారణంగానే రాజ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

పునీత్ మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆస్పత్రి వద్ద వేలాదిగా అభిమానులు చేరుకుంటుండటంతో వారిని అదుపు చేసేందుకు భారీగా బలగాలను మోహరించారు. ఇక కర్ణాటక వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కర్ణాటకలో థియేటర్లన్నీ మూసివేశారు. 2002లో అప్పు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన పునీత్.. ఇప్పటి వరకు హారోగా 32 సినిమాల్లో నటించారు. 

చివరి ట్వీట్ అన్న కోసం..

పునీత్ రాజ్ కుమార్ తన అన్న శివరాజ్ కుమార్ సినిమాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. శివరాజ్ కుమార్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో భజరంగీ ఒకటి. ఆ సినిమాకు సీక్వెల్ గా భజరంగీ 2 టైటిల్ తో ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ పునీత్ ట్వీట్ చేశారు. అదే ఆయన ఆఖరి ట్వీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. 

 

Leave a Comment