5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్.. థర్డ్ వేవ్ ముప్పు అధికం అంటూ..!

కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికే రష్యా, చైనా సహా పలు దేశాల్లో మళ్లీ మొదలైంది. రష్యాలో అయితే రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.. మన దేశంలోనూ కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 కు సంబంధించి 17 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

ఈ కొత్త వేరియంట్ ఏవై.4.2 సెకంట్ వేవ్ సమయంలో బీభత్సం సృష్టించిన డెల్టా ప్లస్ వేరియంట్ కుటుంబానికి చెందినదని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ వల్ల థర్డ్ వేవ్ వచ్చే అవకాశం అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు. దేశంలోని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గురించి అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. కాగా, దేశంలో 16,156 కొత్త కేసులు నమోదు కాగా.. 733 మంది మరణించారు.  

Leave a Comment