‘బీజేపీ విడ్మెడ్’ యాప్ ప్రారంభించిన కన్నా.. 

రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో తయారు చేసిన ‘విడ్మెడ్ యాప్’ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ లో ఆస్పత్రులు మరియు వైద్యులు వ్యక్తిగతంగా ఓపీ సేవలను అందించడం లేదు. బయటకు వెళ్లి వైద్య సహాయం పొందలేక బాధపడుతున్న కోవిడ్ మరియు నాన్ కోవిడ్ రోగులకు బీజేపీ విడ్మెడ్ సహాయం చేస్తుంది.

దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చు. ఈ యాప్ గత మార్చి 25 2020న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందింది. ఈ యాప్ ద్వారా డాక్టర్ రోగులకు పరీక్షల సలహాలు ఇస్తారు.  మన రిపోర్టులను కూడా పంపి నిర్ధారణ అనంతరం మన ఫోన్ నెంబర్ కు డాక్టర్ సూచించిన మందుల జాబితా పంపిస్తారు.  

 

Leave a Comment