కొత్త నిబంధనలతో లాక్ డౌన్ – 4..

21వ శతాబ్దం భారత్ దే..

ప్రధాని నరేంద్ర మోడీ

రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటన

దేశవ్యాప్తంగా మే 17న Lockdown ముగిస్తుందున PM Narendra Modi జాతిని ఉద్దేశించి మరోసారి ప్రసంగించారు. లాక్ డౌన్ 4 కొత్త నిబంధనలతో పూర్తి భిన్నంగా ఉంటుందని ప్రకటించారు. 18వ తేదీకి ముందే వాటిని ప్రకటిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మంది కరోనా బారిన పడ్డారని, 2.45 లక్షల మంది మరణించారని తెలిపారు. ఒక వైరస్ ప్రపంచ తిరుగుబాటుకు దారితీసిందన్నారు. 

ఆర్థిక ప్యాకేజీ ప్రకటన..

భారతీయుల సంకల్పం కరోనా సంక్షోభం కన్నా గొప్పదని, 21వ శతాబ్దం భారత్ దే అని అన్నారు. దేశఆర్థిక రంగం పునరుత్తేజానికి రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతం అన్నారు. ఈ ప్యాకేజీ అన్ని రకాల ఉద్యోగులకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకే అని అన్నారు. ఈ ప్యాకేజీ మేకిన్ ఇండియా లక్ష్యాన్ని కూడా సాధించేందుకు దోహదం చేస్తుందన్నారు. రేపటి నుంచి ఈ ప్యాకేజీకి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేస్తారన్నారు. 

జాగ్రత్త పడాలి..

కరోనా వైరస్ ఎక్కువ కాలం మనతోనే ఉంటుందని శాస్త్రవేత్తలు మరియు నిపుణులు అంటున్నారని, కాని అలా జరగకుండా చేయాలని అన్నారు. ఈ వైరస్ మనల్ని మన లక్ష్యాల నుంచి దూరంగా వెళ్లనివ్వకుండా మనం జాగ్రత్త పడాలన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అన్నారు. 

ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులనే కొనాలి..

దేశంలో ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలన్నారు. స్థానికంగా ఉండే బ్రాండ్లు ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉండేవన్నారు. ప్రస్తుత పరిస్థితిలు అందరిలో విశ్వాసాన్ని పెంచాయన్నారు. చేనేత కార్మికులను ఖాదీని వాడమని చెప్పినప్పుడు వాటికి డిమాండ్ బాగా పెరిగిందన్నారు. 

ఆత్మనిర్భర్ భారత్ మన లక్ష్యం..

కరోనా కంటే ముందుగా ఉన్న ప్రపంచం ఏంటో మనకు తెలుసని, కరోనా సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని మనం చూస్తున్నామని చెప్పారు. ఆత్మానిర్భర్ భారత్..మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. శాస్త్రాలు చెప్పింది కూడా ఇదే అన్నారు. కరోనా ప్రారంభం అయినప్పుడు దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేదా కాదని, నేడు ప్రతి రోజు 2 లక్షల పీపీఈ కిట్స్, 2 లక్షల ఎన్-95 మాస్కులు తయారవుతున్నాయని తెలిపారు. ఆపదను అవకాశంగా  మార్చుకున్నామన్నారు. స్వయం సంవృద్ది సాధించే దిశలో భారత్ వేగంగా ముందుకు పోతోందని ప్రధాని మోడీ చెప్పారు. 

 

.

 

Leave a Comment