ఆస్ట్రేలియా చట్టసభల్లో కందుకూరు యువకుడు..!

విదేశాల్లో వివిధ రంగాల్లో మన తెలుగువారు రాణిస్తున్న సంగతి తెలిసిందే.. సాఫ్ట్ వేర్ తో చట్టసభల్లోనూ మన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియా చట్టసభల్లో అడుగుపెడుతున్నాడు. తన సమాజ సేవతో యువత కోటలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు..

ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువతకు చట్టసభల్లో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంటుంది. సామాజిక సేవపై ఆసక్తి చూపే విద్యార్థులు టీనేజిలోనే చట్టసభల్లో అడుగుపెడుతుంటారు. ఈక్రమంలో నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన తనూజ్ చౌదరి(15) అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. 

తనూజ్ తండ్రి రామకృష్ణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తారు. 12 ఏళ్ల క్రితమే ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డారు. తనూజ్ చౌదరి అక్కడి కాలేజీలో ప్రస్తుతం ప్లస్ వన్(ఇంటర్) చదువుతున్నాడు. చదువుకుంటునే సామాజిక సేవ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవాడు. ఇది గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తనూజ్ ను విద్యార్థి ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఆస్ట్రేలియా అసెంబ్లీ సమావేశాల్లో తనూజ్ కూడా పాల్గొంటాడు.. తనూజ్ సాధించిన ఈ ఘనతపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

 

 

 

Leave a Comment