ఏపీలో 4 రోజులు భారీ ఉష్ణోగ్రతలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయని, వచ్చే నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రానున్న రాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

రానున్న నాలుగు రోజులు ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవి తీవ్రత, ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు పేర్కొంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అకాశం ఉందని చెప్పింది.

ఈనెల 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపింది. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

 

 

  

 

Leave a Comment