ఎమ్మెల్యే ఎన్నికలపై  పరీక్షల్లో ఓ విద్యార్థి జవాబు.. పైసలు, బిర్యానీ ఇస్తారు.. ఓటేస్తాం..!

ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.. ఇంటింటికి డబ్బులు పంచడం, బిర్యానీ పెట్టడం, మందు ఇవ్వడం చేస్తారు. జనం కూడా డబ్బులు పంచిన అభ్యర్థికే ఓటు వేస్తుంటారు. పిల్లలు కూడా ఎన్నికలు అంటే ఇలానే జరుగుతాయామో అని ఫిక్స్ అయినట్లు ఉన్నారు.. ఎన్నికలకు సంబంధించి ఓ విద్యార్థి రాసి జవాబు చూసి అందరూ షాక్ అవుతున్నారు..ప్రస్తుతం ఈ ఆన్సర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. 

ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి? అనే ప్రశ్నలకు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం లింగారెెడ్డి గూడ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి వెరైటీ సమాధానం రాశాడు.. పుస్తకాల్లో చదివింది.. టీచర్లు చెప్పింది కాకుండా.. తాను చూసింది పరీక్షల్లో రాశాడు. అదే పేపర్ పై పెట్టాడు.. ఇంతకు ఏం రాశాడంటే..

ప్ర: ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి?

జ: ఎమ్మెల్యే ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నకోవాలని చెప్తారు. ప్రచారం చేస్తారు. 18 సంవత్సరాలు ఉన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైసలు ఇస్తారు. బిర్యానీలు, మందు బాటిల్స్, ఆడవారికి చీరలు పంచుతారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేను ప్రజలు ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో లెక్క చేస్తుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు.  

ప్రస్తుతం ఆ విద్యార్థి రాసిన జవాబు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓట్ల కోసం రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయో.. ఈ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు..పైగా ఈ జవాబుకు పేపర్ దిద్దిన ఉపాధ్యాయుడు కూడా 4 మార్కులు వేశారు. మారిన విద్యావిధానం ప్రకారం విద్యార్థుల సృజనాత్మకతకు మార్కులు వేయాల్సిందే అని ఉపాధ్యాయుడు అన్నారు.   

 

 

Leave a Comment