అరుణాచల్ ప్రదేశ్ లో అకస్మాత్తుగా నల్లగా మారిన నది.. చైనా చర్యలే కారణం..!

అరుణాచల్ ప్రదేశ్ లోని కామెంగ్ నది.. అది మంచినీటితో ప్రవహించే నది.. కానీ ఒక్కసారిగా ఆ నది రూపం మారిపోయింది. నదిలోని నీరు అకస్మాత్తుగా నలుపురంగులోకి మారాయి. దీంతో నదిలో ఉన్న వేలాది చేపలు చనిపోయాయి. కాలుష్య కారకాలు భారీస్థాయిలో నదిలో కలవడంతోనే నీటి రంగు మారినట్లు అధికారులు గుర్తించారు. దీనికి కారణం చైనానే అని నదికి సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆరోపిస్తున్నారు. 

ప్రాథమిక పరిశోధన ప్రకారం.. నదిలో నీటిలో టీడీఎస్ అధికశాతం ఉన్నాయని, దీంతో చేపలు ఆక్సిజన్ పీల్చుకోలేక చనిపోయాయని ధ్రువీకరించారు. సాధారణంగా నీటిలో ఒక లీటర్ కు 300 నుంచి 1200 మిల్లీగ్రామాలు టీడీఎస్ ఉంటుంది. కానీ ప్రస్తుతం కామెంగ్ నదిలో టీడీఎస్ లీటర్ కు 6,800 మిల్లీగ్రాములు ఉంది. దీంతో కామెంగ్ నదిలో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని, చనిపోయిన చేపలను విక్రయించవద్దని తూర్పు కమెంగ్ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. పొరుగు దేశం చైనా చేపట్టిన భారీ నిర్మాణాలే నది కాలుష్యానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

  

Leave a Comment