పవన్ తో అందుకే సినిమా చేయలేదు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!

దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో సినిమాలు చేశారు. త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కూడా ఆయన సినిమా చేయబోతున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం ఆయన ఇప్పటి వరకు సినిమా చేయలేదు. రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంతో రాజమౌళి పవన్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 

శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు తీస్తారని అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశానని అన్నారు. పవన్ కళ్యాణ్ ను షూటింగ్ సమయంలో ఒకసారి కలిశానని, సమయం ఇస్తే కథ చెబుతానని పవన్ చెప్పానన్నారు.

 పవన్ కళ్యాణ్ కబురు కోసం ఏడాదిన్నర కాలం ఎదురుచూశానని, అయినా ఆయన నుంచి కబురు రాలేదని అన్నారు. ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నానన్నారు. మాస సినిమాలు కాకుండా భారీ ప్రాజెక్టులు చేయాలని భావించాన్నారు. అలా మగధీర, యమదొంగ సినిమాలు చేశానని తెలిపారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని అన్నారు. తాము ఇద్దరం రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నామని, తమ ఇద్దరివి విభిన్న దారులని రాజమౌళి చెపపుకొచ్చారు.  

 

Leave a Comment