దెయ్యం లుక్ లో భయపెడుతున్న చిరంజీవి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ లో ఉంటారు. సినిమాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.. తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోలో చిరు కొత్త లుక్ లో కనిపించారు. దెయ్యం లుక్ లో కొత్త అవతారమెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చిరంజీవి అలా కనిపించడం ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఈ లుక్ సినిమాలకు సంబంధించింది కాదు.. అక్టోబర్ 31న హలోవీన్ డే సందర్భంగా చిరంజీవి వేసిన దెయ్యం లుక్.. హలోవీన్ డే సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఫన్ మోడ్ లో, దెయ్యం గెటప్ లో ఈ ఈవెంట్ ను జరుపుకున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ కూడా దెయ్యం లుక్ లో ఉన్న సరదా వీడియో ను ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. హ్యాపీ హలోవీన్ అంటూ విషెస్ తెలిపారు. దీంతో పాటు ఎగ్జయిట్మెంట్ డే అంటూ క్యాప్సన్ జత చేశారు. అయితే ఈ లుక్ కోసం ఆయన మేకప్ వేసుకోలేదు. ఓ యాప్ ను ఉపయోగించి ఈ విధంగా వీడియో చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీరు చూడండి.. 

 

Leave a Comment