ఫిల్టర్ లేకుండా స్వచ్ఛమైన నీరు.. ఒక్క ట్యాబ్లెట్ తో నీరు ఫిల్టర్..!

ఈరోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఫిల్టర్ నీళ్లే తాగుతున్నారు. ఒకవేళ మీరు బయటికి వెళ్లినప్పుడు మీకు ఫిల్టర్ వాటర్ దొరక్కపోవచ్చు. కానీ ఏదో ఒక నీటిని దాహం తీర్చుకోవాల్సిందే. ఆ నీళ్లు స్వచ్ఛమైనవా లేదా అనేది కచ్చితంగా మీకు తెలియదు. అలాంటప్పుడు ఆ నీళ్లను మరిగించి తాగాలి. కానీ బయట ఉన్నప్పుడు నీళ్లను మరగబెట్టడం సాధ్యం కాదు. అయితే మీరు బయటికి వెళ్లి నప్పుడు ఎలాంటి నీళ్లు ఉన్నా వాటిని ఫిల్టర్ చేసే ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయి. 

అదే హైడ్రొజెల్ ట్యాబ్లెట్.. ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, కెమికల్ ఇంజనీర్లు కలుషితమైన నీటిని శుద్ధి చేయడానికి హైడ్రోజెల్ ట్యాబ్లెట్ ను అభివృద్ధి చేశారు. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. నీరు తాగాలంటే మరగబెట్టాలి.. లేక శుద్ధీకరించాలి.. ఈ రెండు పద్ధతులకు కరెంట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ మూరుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సరైన వనరులు ఉండవు. కానీ హైడ్రోజెల్ ట్యాబ్లెట్ ఉంటే ఇవి అవసరం లేదు. హైడ్రోజెల్ లో ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్ నీటిలో బ్యాక్టీరియాను చంపేస్తుంది. 

హైడ్రోజెల్ ట్యాబ్లెట్ ఒక గంటలో కలుషితమైన నీటిని తాగునీరుగా మార్చేస్తుంది. ఇందుకు విద్యుత్ అవసరం లేదు. ఎలాంటి హానికారకాలు లేవు.. సూర్యకాంతిలో నీరు అవిరై అందులోని కాలుష్యాన్ని వేరు చేసినట్లుగా.. హైడ్రోజెల్ తనంతట తానే నీటిని శుద్ధి చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాగునీటి కొరతను తీర్చడంలో హైడ్రోజెల్ ఉపయోగకరంగా ఉంటుందని టెక్సాస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. 

Leave a Comment