మహిళా మంత్రిని ‘ఐటెం’ అన్న కమల్ నాథ్..!

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీపీ అధ్యక్షుడు కమల్ నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ మంత్రి ఇమార్తి దేవీని ‘ఐటెం’ అని సంబోధించారు. ఈయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉప ఎన్నికల జరుగుతున్న దుబ్రా నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేశారు. 

ప్రచారం సందర్భంగా ప్రత్యర్థి ఇమార్తి దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే సాధారణ వ్యక్తి అని, ఆమె లాగా కాదని అన్నారు. అమె పేరేమిటో.. నా కంటే మీకే బాగా తెలుసు.. ఆమె ఐటం అని కమల్ నాథ్ నోరు జారారు. 

ఇక తన కేబినెట్ లో మహిళా మంత్రిపై  కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అందుకు నిరసనగా సోమవారం రెండు గంటలపాటు మౌనవ్రత దీక్ష చేపట్టారు. మాజీ సీఎం వ్యాఖ్యలు కేవలం ఇమర్తీ దేవికి మాత్రమే కాదని, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రతి మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని చెప్పారు. దీనిపై బీజేపీ ప్రతినిధి బృందం బోపాల్ లో ఎన్నికల సంఘం అధికారులను కలిసి కమల్ నాథ్ మహిళలు, దళితులను అవమానించారని ఫిర్యాదు చేశారు. 

Leave a Comment