బన్ని భార్యపై చిరంజీవి చిన్నల్లుడు హాట్ కామెంట్..!

హీరో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినిమా హీరోయిన్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. కూతురు, కొడుకు, అల్లు అర్జున్ తో కలిసి ఉన్న ఫొటోలను స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 

తాజాగా స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. నటి సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహా రెడ్డికి స్టయిలింగ్ చేశారు. ప్రముఖ డిజైనర్ శారీలో అందమైన లుక్ లో ఆమె కనిపించారు. స్నేహారెడ్డి ఫొటోపై చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ స్పందించారు. హాట్ ఎమోజీతో స్నేహా.. అంటూ కామెంట్ చేశాడు. ఈ ఫొటోతో పాటు కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్ రెండు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.    

Leave a Comment