లేడీ డాక్టర్ కి లైన్ వేస్తున్న బుడ్డోడు.. 40 లక్షల మంది చూసిన వీడియో..!

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులోనూ చిన్నారుల వీడియోలు ఎంతో ముద్దొస్తుంటాయి.. ఎందుకంటే చిన్నారులకు సంబంధించి ప్రతిదీ అపూరపంగానే అనిపిస్తుంది. తాజాగా ఓ బుడ్డోడు మహిళా డాక్టర్ తో ప్రేమలో పడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను ఇప్పటి వరకు 40 లక్షల మంది వీక్షించారు.. 

ఆ వీడియోలో ఓ చిన్నారి ఆరోగ్యంగా బాగాలేకపోవడంతో మహిళా డాక్టర్ పరీక్షిస్తోంది. ఆ సమయంలో బుడ్డోడు అయోమయంగా ఉంటాడు.. అయితే డాక్టర్ ఆ చిన్నారిని నవ్వించడానికి చక్కిలిగింతలు పెడుతుంది. అప్పుడు ఆ బుడ్డోడు చాలా క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. చాలా ప్రేమగా తన మెడను డాక్టర్ చేతిపై ఉంచుతాడు. ఎంతో ప్రేమగా ఆమెను చూడటం ప్రారంభిస్తాడు..  ఈ వీడియోకు 40 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘ఇది చాలా క్యూట్ వీడియో’, ‘ఇది వీడియో గుండెని టచ్ చేసింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. 

Leave a Comment