సీఎం జగన్ ప్రసంగంలో ఇన్ని తప్పులా?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధఈ మున్సిపల్ స్డేడియంలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. ఆయన చేసిన ప్రసంగంపై విమర్శలు వస్తున్నాయి. 45 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో అనేక తప్పులు దొర్లాయి. పదాలు పలికేటప్పుడు పలుమార్లు తడబాటుకు గురయ్యారు. కొన్ని పదాలు సరిగ్గా పలకలేకపోయారు. దాదాపు 20కిపైగా పదాలు తప్పుగా మాట్లాడారు. మరికొన్ని పదాలు చదవడంలో పొరబడి తర్వాత సరిదిద్దుకున్నారు. 

సీఎం జగన్ ప్రసంగంలో తప్పుగా పలికిన పదాలు ఇవే..

  • ‘మహాయోధుల త్యాగాల’కు బదులు ‘మహానుయోధుల త్యాగాల’
  • స్వాతంత్య్ర వజ్రోత్సవాలుకు బదులు స్వాతంత్య్ర వజ్జోత్సవాలు
  • ఆర్థిక స్వావలంబనకు బదులు ఆర్థిక స్వాలంబనకు 
  • సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు బదులు సుస్థిరాభివృద్ధి లక్షణాలు
  • ఉటంకించారు బదులు ఉటకించారు
  • స్వేదం బదులు స్వేద్వం
  • విప్లవాత్మక బదులు విప్లవాత్మిక
  • అభ్యదయం బదులు అభ్యద్వయం
  • నియామకం బదులు నియాకం
  • సామాజిక అభద్రత బదులు సామాజిక అభ్ర 
  • ప్రతి పథకం బదులు ప్రతి ప్రతకం
  • ధర్మాల సమ్మేళనం బదులు ధర్మేలా సమ్మేళన
  • ఆర్థికంగా బదులు హార్థికంగా
  • ఆవిర్భవించాలి బదులు ఆవిర్భించాలి
  • కార్పొరేట్ విద్యాసంస్థలు బదులు కార్పొరేట్ విద్య సంస్థలు

Leave a Comment