మరో వివాదాస్పద ఫొటో ట్వీట్ చేసిన ‘కాళీ’ డైరెక్టర్ లీనా..!

వివాదాస్పద లేడీ డైరెక్టర్ లీనా మణిమేఖలై ‘కాళీ’ డ్యాక్యుమెంటరీతో వివాదం రాజేసిన సంగతి తెలిసిందే.. అందులో కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లుగా ఉన్న పోస్టర్ వివాదాస్పదమైంది.. తాజాగా లీనా మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. మరోసారి హిందూ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 

ఈసారి శివపార్వతుల వేషాధారణలో ఉన్న వ్యక్తులు సిగరెట్ తాగుతున్న ఫొటోను ఆమెను గురువారం షేర్ చేశారు. అయితే, ఇది తన డాక్యుమెంటరీలోనిది కాదని, గ్రామీణ భారతంలోని నిజ జీవిత దృశ్యమని సమర్థించుకున్నారు.

 జానపద థియేటర్ కళాకారులు తమ ప్రశర్శనల తర్వాత ఏం చేస్తారో బీజేపీ పెరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదన్నారు. ఇది తన సినిమాలోనిది కాదని, రోజువారీ గ్రామీణ భారతదేశం నుంచి ఈ సంఘ్ పరివార్లు తమ కనికరంలేని ద్వేషం, మత దురభిమానంతో నాశనం చేయాలనుకుంటున్నారని తెలిపారు. హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదని ఆమె చేసిన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. కాగా, కాళీమాతపై చేసిన పోస్ట్‌కు సంబంధించి మణిమేఖలైపై దేశంలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి.

Leave a Comment