పోలీస్ ఉద్యోగం ఇష్టం లేక..యువ ఏఆర్ ఎస్సై ఆత్మహత్య..!

పోలీస్ ఉద్యోగం చేయలేక ఓ యువ ఏఆర్ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా సురుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన పైలా చంద్రారావు(28) కడపలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. కడప ఎన్జీవో కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. 

చంద్రారావుకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. తల్లిదండ్రుల బలవంతంతోనే ఉద్యోగంలో చేరారు. ఈనెల 10న చంద్రారావు సొంతూరుకు వెళ్లారు. అక్కడి నుంచి ఈనెల 28న తిరిగి కడపకు వచ్చారు. గురువారం తన గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గదిలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసి ఉంది. చంద్రారావు మృతదేహాన్ని కడప రిమ్స్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Leave a Comment