పెట్రోల్ పై ఏకంగా రూ.25 తగ్గించిన జార్ఖండ్ ప్రభుత్వం..!

ద్విచక్రవాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించంది. పెట్రోల్ ధరలను లీటర్ కి రూ.25 తగ్గించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. మోటార్ సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్ కొట్టించేవారికి లీటర్ కి రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం 2022, జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

పెట్రోల్ ధరల తగ్గింపు పేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని హేమంత్ సోరెన్ వెల్లడించారు. ద్విచక్ర వాహనంలో నింపిన ప్రతి లీటర్ కి రూ.25 నగదు ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుందని తెలిపారు. గరిష్టంగా 10 లీటర్ల వరకు ఈ రాయితీ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రో ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇది ఊరట కలిగించే విషయం.. 

Leave a Comment