‘జబర్దస్త్’ నుంచి మరో వికెట్ పడింది.. షోకు గుడ్ బై చెప్పిన అనసూయ..!

బుల్లితెరపై ‘జబర్దస్త్’ షోకి ఉన్న ఫాలోయింగే వేరు.. ఈ షోని కాపీ చేస్తూ ఎన్ని షోలు వచ్చినా.. దాని ముందు ఏదీ నిలవలేకపోయాయి..అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోకి రేటింగ్స్ తగ్గుతున్నాయి. పైగా గత మూడేళ్లుగా జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. నాగబాబు, రోజా, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. ఇలా కీలకమైన సభ్యులు తప్పుకుంటూ వచ్చారు.. 

ఇప్పుడు ఏకంగా అనసూయ వంతు వచ్చింది. ఇన్నాళ్లు జబర్దస్త్ కి గ్లామరస్ అంబాసిడర్ గా ఉన్న అనసూయ ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనుసూయ వెల్లడించింది. అయితే ‘జబర్దస్త్’ షో పేరును ప్రస్తావించకుండా.. తాను తప్పుకుంటున్నట్లు చెప్పింది. తన కెరీర్ లో తీసుకున్న పెద్ద నిర్ణయాన్ని ఈ రోజు అమలు చేస్తున్నట్లు చెప్పింది.   

అనసూయకు జబర్దస్త్ తో ఉన్న అనుబంధమే వేరు.. కేవలం అనసూయ అందాలు చూసేందుకు జబర్దస్త్ షో ఫాలో అయ్యేవాళ్లు కూడా ఉన్నారు. ఆమె వేసుకునే దుస్తులు, వేసే డాన్స్ చూడ్డానికి చాలా మంది ఇష్టపడేవారు. మధ్యమధ్యలో వచ్చే అనసూయ ఎక్స్ ప్రెషన్స్, ఆ కొంటె నవ్వులకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే జబర్దస్త్ షోకు  టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయాయి. ఇక అనసూయ కూడా తప్పుకోవడంతో రేటింగ్స్ మరింత తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. 

Leave a Comment