చావుబతుకుల్లో ఉన్న అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పాడు..!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాను ఎంత బిజీగా ఉన్న తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. ఆపదలో ఉన్న ఫ్యాన్స్ కు ఎప్పుడు అండగా ఉంటారు. గతంలోనూ ఎన్నోసార్లు తన అభిమానుల కోరికలను తీర్చాడు. తాజాగా చావు బతుకుల్లో ఉన్న తన అభిమాని కోరికను తీర్చాడు తారక్.. 

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడుపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్ కు పిచ్చ ఫ్యాన్. అయితే మురళికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మురళికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. అయితే అతడి పరిస్థితి మరింత విషమించింది. ఈక్రమంలో వైద్యులు అతడి కోరులకు, ఇష్టాలను తెలుసుకున్నారు. 

దీంతో మురళి తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ ని చూడాలని ఉందని కోరాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్టీఆర్ తన వీరాభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. అనంతరం డాక్టర్లు, కుటుంబ సభ్యులను పలకరించి నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దామని ధైర్యం చెకప్పారు. 

 

Leave a Comment