మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగానే కొనసాగుతోంది. ఈక్రమంలో కరోనా కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి.  తాజాగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయా. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,431 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

దేశంలో ఇప్పటి వరకు 3 కోట్ల 38 లక్షల 94 వేల 312 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 4 లక్షల 49 వేల 856 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటి వరకు 3 కోట్ల 32 లక్షల 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా కారణంగా దేశంలో 318 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 12 వేల 616 కేసులు నమోదుకాగా.. 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ఏకంగా రాష్ట్రంగా కేరళ ఉంది.  

 

Leave a Comment