పప్పులో కాలేసిన బీజేపీ నాయకులు.. నిఖిల్ ని పిలవబోయి నితిన్ ని పిలిచారట..!

ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే.. పర్యటనలో భాగంగా ఆయన టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, హీరో నితిన్ తో హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మిథాలీ రాజ్ రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. మిథాలీ రాజ్ క్రికెట్ కి వీడ్కోలు పలికారు కాబట్టీ.. రాజకీయాల్లోకి వస్తున్న వార్త నిజమే అనుకోండి.. 

అయితే హీరో నితిన్ ని జేపీ నడ్డా ఎందుకు కలిశారో ఎవరికీ అర్థం కావట్లేదు. అందరూ అయోమయానికి గురయ్యారు.. ఈ భేటీపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు హీరో నితిన్ ని నడ్డా కలవాలనుకోలేదట.. కార్తికేయ 2 హీరో నిఖిల్ ని కలవబోయి నితిన్ ని కలిశారట.. 

కార్తికేయ 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. శ్రీ కృష్ణుడు నేపథ్యంలో సాగిన కథ నచ్చడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నిఖిల్ ని కలవాలనుకున్నారట.. ఇదే విషయాన్ని ఇక్కడి బీజేపీ నాయకులకు చెప్పారట.. అయితే బీజేపీ నాయకులు పొరబడి.. నిఖిల్ ని పిలవబోయి నితిన్ ని పిలిచారట.. దీంతో నితిన్ ని నడ్డా కలిశారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. బీజేపీ నాయకులకు ఆ మాత్రం తేడా తెలియట్లేదా అంటూ ఓ ఆట ఆడుకుంటున్నారు. 

Leave a Comment