మీ మొబైల్ పాస్ వర్డ్ లేదా ప్యాటర్న్ మర్చిపోయారా? అయితే ఇలా అన్ లాక్ చేయండి..!

ఈరోజుల్లో మొబైల్ భద్రత కోసం పిన్, పాస్ వర్డ్, ప్యాటర్న్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ను లాక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు యూజర్లు తమ మొబైల్ యొక్క పాస్ వర్డ్ లేదా ప్యాటర్న్ ని మర్చిపోతుంటారు. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగితే..భయాపడాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ లలో పాస్ వర్డ్, పిన్ లేదా ప్యాటర్న్ ని మర్చిపోతే అన్ లాక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆండ్రాయిడ్ ఫోన్ అన్ లాక్ చేయడం ఎలా? 

  • మీ ఆండ్రాయిడ్ స్మార్ ఫోన్ ని సెటప్ చేస్తున్నప్పుడు గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ చేసి ఉంటే, మీ ఫోన్ ను సులభంగా అన్ లాక్ చేయవచ్చు. 
  • మీరు పాస్ వర్డ్ మర్చిపోయినట్లయితే.. Forget Pattern/Password పై క్లిక్ చేయాలి. అప్పుడు గూగుల్ అకౌంట్ కు లాగిన్ చేసే ఆప్షన్ వస్తుంది. 
  • లాగిన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీ ఫోన్ అన్ లాక్ చేయబడుతుంది. అలాగే మీరు కొత్త పాస్ వర్డ్ ని సృష్టించగలరు. ఈ ప్రాసెస్ లో మీ డేటా కూడా సేవ్ అవుతుంది. 

ఐఫోన్ లో అన్ లాక్ చేయడం ఎలా?

  • మీరు ఐఫోన్ స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మరిచిపోతే, ఫస్ట్ మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. 
  • ఆ తర్వాత మొబైల్ ని రికవరీ మోడ్ లో ఉంచడానికి మీరు Mac/PCకి కనెక్ట్ చేయాలి. పవర్ బటన్ లేదా వ్యాల్యూమ్ బటన్ ని కొద్ది క్షణాలు నొక్కి పట్టుకోవాలి. 
  • Mac/PCలో iTunes ఇన్ స్టాల్ చేసుకోవాలి. తర్వాత మీ ఫోన్ రికవరీ మోడ్ స్క్రీన్ ని చూస్తారు. దానిని iTunes తో నియంత్రించగలరు. మీరు రీస్టోర్ ని ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ మొత్తం డేటాతో పాటు పాస్ వర్డ్ కూడా తీసివేయబడుతుంది.  
  • తర్వాత బ్యాకప్ నుంచి మీ డేటాను రికవరీ చేసుకోవచ్చు.   

Leave a Comment