ఆత్మహత్య చేసుకున్న పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్..!

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుర్గం చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మృతదేహం వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

పోలీసుల దర్యాప్తులో మృతుడు రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం కొత్తగూడకు చెందిన సాయికుమార్ అని తేలింది. గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని, ఇబ్బందులు తట్టుకోలేక దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. 

మృతుడు సాయికుమార్ గతంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినట్లు తెలిసింది. అక్కడ మానేసి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ఉద్యోగం రాలేదు. అప్పుల బాధలు ఎక్కవై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. 

 

Leave a Comment