100వ టెస్టులో 200.. జోరూట్ రికార్డు..!

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ రికార్డు సృష్టించాడు. చెన్నైలో భారత్ తో జరుగుతున్న టెస్టు జోరూట్ కు 100వ టెస్టు మ్యాచ్.. ఈ మ్యాచ్ లో రూట్ డబుల్ సెంచరీ చేశాడు. 100వ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. బౌలర్లకు సహకరించని చిదంబరం స్టేడియంలో రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 218 పరుగులు చేసి ఔటయ్యాడు. 

కాగా, గత కొన్ని వారాలుగా జో రూట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆడిన ప్రతి టెస్టులో సెంచరీ చేశాడు. ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లోనూ రూట్ సెంచరీలు చేశాడు. రెండు టెస్టుల్లో కూడా 228, 186 పరుగులు చేశాడు. ఇప్పడుు ఇండియాలోనూ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 

 

Leave a Comment