ఫొటోగ్రాఫర్ ఓవరాక్షన్.. అదిరిపోయే దెబ్బ.. వీడియో చేస్తే నవ్వు ఆపుకోలేరు..!

  ఏ ఫంక్షన్ జరిగినా ఆ తీపి జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరుచుకుంటారు. ప్రస్తుతం కొంచెం పేదరికంలో ఉన్నా.. శుభకార్యాలకు ఎంతైన ఖర్చు పెట్టి  ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అని హంగామా చేస్తున్నారు. ఇక ఫొటో గ్రాఫర్లయితే సరికొత్త స్టయిల్స్ లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. 

అలా ఓ పెళ్లి వేడుకలో ఫొటో గ్రాఫర్ మరీ అతి చేసి వరుడి చేతిలో దెబ్బలు తిన్నాడు. ఓ పెళ్లిలో వరుడు, వధువు స్టేజీ మీద నిలబడి ఉన్నారు. ఫొటో గ్రాఫర్ వారి ఫొటోలు తీస్తూ పెళ్లి కొడుకును సైడ్ చేశాడు. మరీ అతి చేసి వధువు ముఖాన్ని సరిచేస్తూ ఫొటోలు తీస్తున్నాడు. అలా చేస్తే పెళ్లి కొడుకుకు మండింది. ఫొటో గ్రాఫర్ కు లాగి పెట్టి ఒక్కటి ఇచ్చాడు. 

ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే వరుడి రియాక్షన్ చూసి వధువు పొట్ట పట్టుకుని పగలబడి నవ్వింది. కొసమెరుపు ఏంటంటే దెబ్బలు తిన్న ఫొటోగ్రాఫర్ కూడా నవ్వులు చిందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలస్యం ఎందుకు మీరు నవ్వుకోండి.. 

You might also like
Leave A Reply

Your email address will not be published.