అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలాతాలపై ఉత్కంఠకు తెరపడింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికయ్యారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బైడెన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓటమి తప్పలేదు. 

జో బైడెన్ మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా, డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీకి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ దాటేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యరు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా విజయం సాధించారు. కాగా అమెరికాకు ఎన్నికైన తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ రికార్డు సృష్టించారు.

Leave a Comment