యూజర్లకు జియో షాక్.. భారీగా ఛార్జీల పెంపు.. పెరిగిన ఛార్జీలు ఇవే..!

ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్లకు షాక్ ఇచ్చింది. జియో ప్రీపెయిడ్ ఛార్జీలను భారీగా పెంచింది. డిసెంబర్ 1 నుంచి 21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఛార్జీలు పెంచుతున్నట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. టెలికాం పరిశ్రమలో ఈ కొత్త టారీఫ్ ప్లాన్స్ అత్యుత్తమ ప్లాన్స్ గా నిలుస్తాయని జియో వెల్లడించింది. 

జియో కొత్త ప్లాన్స్ ఇలా ఉన్నాయి.. 

  • జియో ప్రాథమిక ప్లాన్ రూ.75కు బదులుగా ఇకపై రూ.91 చెల్లించాలి. 
  • రూ.199 ప్లాన్(28 రోజులకు 1.5 జీబీ/డైలీ) ధరను రూ.239కు
  •  రూ.399 ప్లాన్ (56 రోజులకు 1.5 జీబీ/డైలీ)ను రూ.479కు
  • రూ.444 ప్లాన్(56 రోజులకు 2 జీబీ/డైలీ)ను రూ.533కు
  • రూ.555 ప్లాన్(84 రోజులకు 1.5 జీబీ/డైలీ)ను రూ.666కు సవరించింది. 
  • రూ.599 ప్లాన్(84 రోజులకు 2 జీబీ/డైలీ)ను రూ.719కు పెంచారు.
  • ఇక అదనపు డేటా ప్లాన్స్ లను రూ.51 నుంచి రూ.61కి(6 జీబీ), రూ.101 నుంచి రూ.121కి(12 జీబీ), రూ.251 నుంచి రూ.301కి (50 జీబీ) పెంచింది.  

Leave a Comment