బండ్ల గణేష్ గొప్ప మనసు.. నేపాలీ చిన్నారిని దత్తత తీసుకున్నారు..!

టాలీవుడ్ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ మంచి మనుసు చాటుకున్నాడు. ఓ నేపాలీ చిన్నారిని ఆయన దత్తత తీసుకున్నారు. పేదరికం కారణంగా ఆ చిన్నారి తల్లి ఆమెకు తిండి పెట్టలేని స్థితిలో ఉంది. ఇది చూసి చలిపోయిన గణేష్ ఆ చిన్నారిని దత్తత తీసుకున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఈ చిన్నారి నేపాల్ లో పుట్టిందని, నెల రోజుల వయసు ఉన్నప్పుడు తన ఇంటికి వచ్చిందని బండ్ల గణేష్ చెప్పారు. తనకు తన కూతురు ఎంతో ఈ చిన్నారి కూడా అంతే అని తెలిపారు. ఈ చిన్నారిని మొదటి సారి చూసినప్పుడు చిన్నారికి ఏ ఆహారం పెడుతున్నారని తన భార్య ఆ పాప తల్లిని అడిందని, తన పాలు ఇస్తున్నానని, రాత్రి సమయంలో పాప ఏడుస్తుందని ఆమె తల్లి చెప్పందని గణేష్ తెలిపారు. 

అప్పడు తన భార్య ఆ చిన్నారిని తీసుకోవాలని తనకు చెప్పిందని అన్నారు. ఆ చిన్నారిని గొప్పగా చదివించాలనుకుంటున్నానని బండ్ల గణేష్ చెప్పారు. నేపాలీ చిన్నారిని బండ్ల గణేష్ దత్తత తీసుకున్నాడనే విషయం తెలిసి చాలా మంది నెటిజన్లు అభినందిస్తున్నారు. 

 

Leave a Comment