భర్త కలను నెరవేర్చేందుకు.. సైన్యంలో చేరిన గాల్వాన్ అమరవీరుడి భార్య..!

గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.. చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన వారిలో దీపక్ సింగ్ కూడా ఒకరు..అయితే ఆయన కన్న కలను ఆయన భార్య నెరవేర్చింది. దీపక్ సింగ్ ఆశయ సాధన కోసం సైన్యంలోకి అడుగు పెట్టింది..

 మధ్యప్రదేశ్ లోని రీవ్ జిల్లాకు చెందిన దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్.. సైన్యంలో ఉన్నప్పుడు దీపక్ తన భార్య రేఖను సైన్యంలో ఓ అధికారిణిని చేయాలని కలలు కనేవారు.. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన ప్రాణాలు కోల్పోయారు. గాల్వాన్ లో చైనా సైనికులతో పోరాడుతూ వీరమరణం పొందారు. 

ఈక్రమంలో దీపక్ సింగ్ ఆశయాన్ని ఎలాగైనా నెరవేర్చాలని భార్య రేఖ నిర్ణయించుకుంది. అందుకోసం ఆర్మీ అధికారులను సంప్రదించింది. వారి మార్గనిర్దేశనంతో నోయిడా వెళ్లి సైనిక ప్రవేశ పరీక్ష రాసింది. ఫస్ట్ టైమ్ పరీక్షలో ఫెయిల్ అయ్యింది. అయినా పట్టు వదలకుండా రెండో సారి పరీక్ష రాసి ఉత్తీర్ణులైంది. దీంతో ఆమె లెఫ్టినెంట్ హోదాను దక్కించుకంది.. 

రేఖకు ఈనెల 28 నుంచి ఆర్మీ శిక్ష ప్రారంభమవుతుంది. చెన్నైలో శిక్షణ ఉంటుందని రేఖా సింగ్ తెలిపారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత సైన్యంలో చేరి దేశానికి సేవలందించనుంది. అయితే రేఖా సింగ్ కి మాత్రం ఓ అంశం ఇబ్బంది పెడుతోంది.. ఎందుకంటే తన భర్త కలను నెరవేర్చినా.. అది చూసేందుకు దీపక్ సింగ్ లేరు.. 

 

Leave a Comment