సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు..!

రాజస్థాన్ లోని ఓ సరస్సులో రూ.2 వేల నోట్ల కట్టలు కొట్టుకొచ్చాయి. స్థానికులు వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్వాధీనం చేసుకున్నారు. అజ్మేర్ లోని అనాసాగర్ సరస్సులో గుర్తు తెలియని వ్యక్తులు పాలిథిన్ కవర్లో కరెన్సీ నోట్ల కట్టలను నీటిలోకి విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ రూ.2 వేల నోట్ల కట్టలన్నీ తడిసిపోయిన ఉన్నాయని, దీంతో ఇంకా లెక్కించడం కుదరలేదని అనాసాగర్ ఎస్సీ బల్ దేవ్ సింగ్ తెలిపారు. నోట్లన్నీ ఆరిన తర్వాత లెక్కిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ నోట్ల కట్టలను ఎవరు విసిరేశారో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ నోట్లు అన్నీ నకిలీ అంటూ వార్తలు వస్తున్నాయి. స్థానికులు మాత్రం ఆ కరెన్సీ నోట్ల మీద ఆర్బీఐ ముద్ర ఉన్నట్లు చెబుతున్నారు.  

గతేడాది జూన్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రూ.200, రూ.500 నోట్ల కట్టలు అజ్మీర్ లోని అనాసాగర్ రామ్ ప్రసాద్ ఘాట్ వద్ద లభించాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అనాసాగర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని నగదు తీసుకున్నారు. కొందరు స్థానికులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీటిలోకి దూకి డబ్బుల కోసం ఎగబడ్డారు.  

Leave a Comment